Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నాకు చాలా పొగరెక్కువని ప్రచారం చేశారు : యాంకర్ శిల్పా చక్రవర్తి

  • నేను చాలా  కచ్చితంగా మాట్లాడతాను 
  • కొంతమంది దూరం పెట్టేవారు 
  •  నేనేంటో నాకు బాగా తెలుసు    
బుల్లితెరపై సందడి చేసిన యాంకర్స్ లో సుమ .. ఝాన్సీ .. ఉదయభాను తరువాత వినిపించే పేరు శిల్పా చక్రవర్తి. వివాహమైన తరువాత కొంత గ్యాప్ తీసుకున్న ఆమె, మళ్లీ ఈ మధ్య స్టేజ్ షోలలో కనిపిస్తున్నారు. తాజాగా ఆమె ఐ డ్రీమ్స్ తో మాట్లాడుతూ, తన కెరియర్ కి సంబంధించిన అనేక విషయాలను పంచుకున్నారు. " సీరియల్స్ లో మా బ్రదర్ గానో .. భర్తగానో నటించే ఆర్టిస్టులను కాస్త చనువుగా పలకరిస్తే చాలు, వెంటనే ఏదో ఉందనే రూమర్లు వచ్చేసేవి. అలాంటి వాళ్లను నేను నిలదీసేదాన్ని కూడా"

"నా నటన గురించి .. యాంకరింగ్ గురించి విమర్శించండి స్వీకరిస్తాను .. కానీ వెనుక నుంచి కామెంట్స్ చేస్తే మాత్రం ఊరుకోనని చెప్పేసేదానిని. నేను ఇలా క్లియర్ గా మాట్లాడేస్తాను గనుక, నన్ను కొంతమంది దూరం పెట్టేవారు. నన్ను ఈవెంట్స్ కి పిలిచేవారు .. నాకు రావలసిన ఎమౌంట్ విషయంలో నేను చాలా కచ్చితంగా మాట్లాడేదానిని. అందుకు కారణం అంతకుముందు కొంతమంది ఎగ్గొట్టడమే. అలా మాట్లాడటంతో నాకు పొగరు అని ప్రచారం చేసేవారు. ఇలాంటివాళ్లు ప్రతిచోటా వుంటారు .. నేనేంటో నాకు తెలుసు" అని చెప్పుకొచ్చారు.        
shilpa chakravarthi

More Telugu News